18-05-2025 12:00:00 AM
- రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి ముత్యాల యాదిరెడ్డి
తుర్కయంజాల్, మే 17 : ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతర పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి ముత్యాల యాదిరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి అధ్యక్షతన సీపీఐ శాఖ మహాసభలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రవీంద్రచారి, యాదిరెడ్డి మాట్లాడుతూ పేదలకు కూడు, గూడు, గుడ్డ కోసం సీపీఐ పోరాడుతుందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో లక్షలాది ఎకరాల భూమిని పంచిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. అనంతరం రాగన్నగూడ, తుర్కయంజాల్, బ్రాహ్మణపల్లి, తొర్రూరు నూతన శాఖలను ఏర్పాటు చేశారు.
రాగన్నగూడ శాఖ కార్యదర్శిగా గంధం బాలరాజు, సహాయ కార్యదర్శిగా సి. పురుషోత్తం, తుర్కయంజాల్ శాఖ కార్యదర్శిగా కె.నరేందర్ గౌడ్, సహాయ కార్యదర్శిగా కె .శేఖర్, తొర్రూర్ శాఖ కార్యదర్శిగా రాచమల్ల బాలకృష్ణ, బ్రాహ్మణపల్లి శాఖ కార్య దర్శిగా వరద కాటమయ్య, సహాయ కార్యదర్శులు ఎస్.జగన్ మోహన్‌రెడ్డి, వి.ముత్తయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, సీపీఐ నాయకులు చల్ల నారాయణరెడ్డి, ముజీబ్, బాల్ రెడ్డి, వెంకటయ్య, కవిత, విజయ తదితరులు పాల్గొన్నారు.