calender_icon.png 8 September, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటేతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది

08-09-2025 12:00:00 AM

ఎమ్మెల్యే కాలె యాదయ్య 

చేవెళ్ల, సెప్టెంబర్ 7 : కరాటేతో ఆత్మస్థైర్యం పెంపొందిస్తుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలం మొకిల గ్రామంలోని పట్లోల్ల రవీందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన 11వ స్టేట్ లెవల్ సక్సెస్ షోటో కాన్ కరాటే డు-ఇండియా ఛాంపియన్షిప్-2025 కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరాటే ఆత్మస్థైర్యం, మనోధైర్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడు కోవడానికి కరాటే నేర్చుకోవాలని సూచించారు. కరాటే వంటి మార్షల్ ఆరట్స్ యువతకు శారీరక, మానసిక బలాన్ని అందిస్తాయని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం పోటీల్లో విజేతలకు మెడల్స్ , సర్టిఫికెట్లను అందజేశారు. ఈ ఈవెంట్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కరాటే మాస్టర్లు, క్రీడాకారులు  పాల్గొన్నారు.