calender_icon.png 16 September, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌లో పాస్‌పోర్ట్ కేంద్రం అప్‌గ్రేడ్ చేసేందుకు కృషి

16-09-2025 12:49:04 AM

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్, సెప్టెంబరు 15 (విజయ క్రాంతి): కరీంనగర్లోని పాస్ పోర్ట్ సేవా కేం ద్రాన్ని అప్ గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆధునికరించిన రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కేంద్రమంత్రి బం డి సంజయ్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు పాస్ పోర్ట్ పొందాలంటే నెలల సమయం పట్టేదని, బ్రో కర్లకు పైసలు ఇవ్వాల్సి వచ్చేదని ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు. తెలంగాణలో 5 పాస్ పోర్టు సేవా కేంద్రాలుంటే అందులో కరీంనగర్ ఉందన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ వల్ల 2014లో ఈ కరీంనగర్ పాస్ పోర్టు సేవా కేంద్రం నుండి సేవలు ప్రారంభమయ్యాయని, ఈ ప్రాంత ప్రజల పెరుగు తున్న ఆకాంక్షలను తీర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తొందన్నారు. పెరుగుతున్న డిమాండ్ ను ద్రుష్టిలో పెట్టుకుని 2022లో దీన్ని పూర్తిస్థాయి పాస్పోర్ట్ సేవా కేంద్రంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. నిన్నటి వరకు ఉన్న భ వనంలో కొన్ని ఇబ్బందులుండేవని, పరిమితమైన సౌకర్యాలు మాత్రమే ఉండేవని, పాస్ పోర్టు సేవలకోసం వచ్చే ప్రజలు కొం త ఇబ్బందిగా ఫీలయ్యేవారని, వీటిని ద్రుష్టి లో ఉంచుకుని ఇప్పుడు 7 వేల చదరపు అ డుగుల విస్తీర్ణంలో ఉన్న ఫార్చ్యూన్ మాల్లో పాస్ పోర్టు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై ప్రజలకు, ఇక్కడి స్టాఫ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. పాస్పోర్ట్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే అవకాశం ఏర్ప డిందన్నారు.

ఈ కొత్త భవనంలో విస్తారమైన వెయిటింగ్ హలు, చిన్నపిల్లల సంరక్ష ణ గది, పార్కింగ్ సౌకర్యం, వీల్చైర్ వంటి అనేక సౌకర్యాలున్నాయని, ప్రతి వర్గానికి గౌరవప్రదంగా, సులభంగా సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కరీంనగర్ పా స్పోర్ట్ సేవా కేంద్రం ఇప్పటికే ప్రతిరోజు సగటున 230 శ్లాట్లను నిర్వహిస్తోందని, ఈ సంఖ్యను 500 కు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా భవిష్యత్తులో పా స్పోర్ట్ సేవల ప్రధాన కేంద్రంగా కరీంనగర్ మారే అవకాశాలున్నాయన్నారు. రాష్ట్ర ప్ర భుత్వం స్థలమిస్తే పర్మినెంట్ బిల్డింగ్ కట్టించేలా చర్యలు చేసుకుంటామని తెలిపారు. అందరం కలిసి కరీంనగర్ జిల్లాను అభివృద్ధి, అవకాశాలకు కేంద్రంగా మారుద్దామ ని బండి సంజయ్ కుమార్ తెలిపారు.

పాస్ పోర్ట్ సేవ కేంద్రం అప్ గ్రేడేషన్ చేయడం సంతోషకరం: రాష్ట్ర సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

పాస్పోర్ట్ సేవా కేంద్ర అప్డేట్ చేయడం సంతోషకరమని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపా రు. కరీంనగర్ పాస్ పోర్ట్ కేంద్రం రాష్ట్రంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 2009-14 లో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పాస్ పోర్ట్ కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇది ప్రభుత్వ భవనంలోనే ఉండాలని మున్సిపల్ భవనం లో ప్రారంభించుకున్నామన్నారు.

ఇప్పుడు ఇక్కడ పాస్ పోర్ట్ కార్యాలయంలో 250 స్లాట్స్ తో నడుస్తుందని, బండి సంజయ్ చొరవ తో 500 స్లాట్స్ ఇచ్చే మౌలిక సదుపాయాలు ఈ కార్యాలయానికి తీసుకు వచ్చారన్నారు. సికింద్రాబాద్ పాస్ పోర్ట్ కి వెళ్తే ఉదయం 4 కి వెళ్ళి లైన్ లో నిలబడాల్సి వచ్చేదని, ఇప్పుడు రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ద్వారా త్వరగా పాస్ పోర్ట్ పని పూర్తి అవుతుందన్నారు. పాస్ పోర్ట్ ఆఫీస్ కి నాకు అవి నాభావ సంబంధం ఉందని, ఇక్కడికి పాస్ పోర్ట్ ఆఫీస్ రావడానికి వందలసార్లు ఢిల్లీలో తిరిగానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరె డ్డి, పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, పాస్ పోర్ట్ ఆఫీసర్ జాయింట్ సెక్రటరీ, ఇతర ముఖ్య నేతలు, అధికారులుపాల్గొన్నారు.