calender_icon.png 16 September, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే సారూ.. ఏమైంది హామీ?

16-09-2025 12:48:42 AM

ఖానాపూర్, సెప్టెంబర్ ౧౫ (విజయక్రాం తి): ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలం గిరిజన గ్రామాలకు వెళ్లే దారిపై దొంతి వాగు పై బ్రిడ్జి నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇంతవరకు ఎందుకు బిర్జు మంజూరు కావడం లేదని గిరిజన గ్రామాల ప్రజలు ఖానాపూర్ ఎమ్మెల్యేను ప్రశ్నించా రు.

సోమవారం పెంబి పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను వివిధ గ్రామాల చిన్న గిరిజనులు బ్రిడ్జి లేకపోవడం వల్ల పడుతున్న కష్టాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఎన్నికలకు ముందు బిర్జు ఏడాది లోపల పూర్తి చేస్తామని చెప్పిన ఇంతవరకు బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో 8 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేకు మొరపె ట్టుకున్నారు.

పేదలకు అండగా ఇందిరమ్మ సర్కార్

ప్రజల కోసమే ఏర్పడ్డ ప్రజాపాలన ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బుజ్జి పటేల్ అన్నారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు అనంత రం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.

ఎం జె పి గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించ కపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.