calender_icon.png 16 September, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీలకు అండగా ఉంటాం

16-09-2025 12:49:52 AM

ఎమ్మెల్యే కోవా లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ ౧౫ (విజయక్రాంతి): అంగన్వాడీల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో అండగా ఉంటానని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. సోమవారం అంగన్వాడి టీచర్స్ అండ్ హె ల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు సమస్యలను వివరించారు.

సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు,హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో అంగన్వాడీల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ముంజం ఆనంద్,అంగన్వాడీలు అనిత, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.