02-11-2025 01:12:05 AM
రూ.52 లక్షలు కొల్లగొట్టిన నిందితులు
రంగంలోకి పోలీస్ బృందాలు.. ముఠా ఆటకట్టు
అమరావతి, నవంబర్ 1: సైబర్ నేరాలకు అలవాటు పడిన నిందితులు ఇటీవల ఒక మహిళా న్యాయవాదికి టోకరా వేసి లక్షలు కాజేశారు. చివరకు కటకటాలపాలయ్యారు. తెలిసిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ని ఏలూరు పట్టణానికి చెందిన ఓ మహిళా న్యాయవాదికి ఇటీవల ఒక కాల్ వచ్చింది. ‘అమెరికాలో ఉన్న మీ కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. మేం అడిగినంత సొమ్ము ఇస్తే తప్ప వారిని విడిచి పెట్టం’ అం టూ కాలర్ బెదిరించాడు.
అలా ఆమె నుంచి రూ.52 లక్షలు తీసుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు ఏలూరు పోలీసులకు ఫిర్యా దు చేయగా. మూడు బృందాలు రంగంలో కి దిగాయి. ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, మహారాష్ర్టను జల్లెడ పట్టి ఎనిమిది మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్టు చేశారు. సైబర్ నేరాల వెనుక కీలక సూత్రధారులు బంగ్లాదేశ్‌కు పారిపోయారని, వారి కోసం గాలిస్తు న్నామని పోలీసులు తెలిపారు. ఈ ముఠా దేశ దేశవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా స్వాహా చేసినట్లు ప్రాథమిక సమాచారం.