calender_icon.png 23 November, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్

10-02-2025 01:33:35 AM

కామారెడ్డి, ఫిబ్రవరి  (విజయ క్రాంతి): బిక్కనూర్ మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న  8 మందిని శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బిక్కనూరు ఎస్త్స్ర ఆంజనే యులు తెలిపారు. మండల కేంద్రంతోపాటు జంగంపల్లి, రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించడంతో పాటు దానిని సేవిస్తూ పలువురు యువకు లకు బానిసగా చేస్తు న్నట్లు తెలిపారు. ఈ విషయంలో వారిని అదుపులో తీసుకొని విచారించి రిమాండ్ కు తరలించినట్టు భిక్కనూర్ పోలీసులు తెలిపారు.