04-12-2025 12:32:05 AM
హైదరాబాద్, డిసెంబర్ 3 : తెలంగాణలో తొలిసారిగా భారీ ప్రైజ్‌మనీతో అతి పెద్ద ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. ఏకాగ్రా చెస్ అకాడమీ డిసెంబర్ 20, 21 తేదీల్లో హైదారాబాద్ హైటెక్స్ వేదికగా ఈ చెస్ టోర్నీని నిర్వహిస్తోంది. వివరా లను టోర్నమెంట్ వైస్ ఛైర్మన్, నంది అవార్డ్ గ్రహీత షరీఫ్ మ హ్మద్ వెల్లడించారు. విజేతలకు రూ.22,22,222 నగదు బహుమతు లను అందజేయనున్నట్టు తెలిపారు.
సాధారణ ఆటగాళ్లకు ఎం ట్రీ ఫీజును రూ.5 వేలు గా నిర్ణయించారు. గ్రాండ్ మాస్టర్లు, ఇంటర్నేషనల్ మాస్టర్లు, మహిళా జీఎం, డబ్ల్యూఐ ఎంలకు ఉచితంగా ఎంట్రీ ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఏకాగ్రా చెస్ అకాడమీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఏకాగ్ర చెస్ అకాడమీ ప్రారంభించినప్పటి నుంచి వేలాది మంది ప్లేయర్స్ కు ట్రై నింగ్ ఇచ్చామని టోర్నమెంట్ డైరెక్టర్ గిరీశ్ రెడ్డి చెప్పారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఏకాగ్రా చెస్ స్కాలర్‌షిప్ కోసం ఎంపిక చేస్తామని తెలిపారు.