04-12-2025 12:29:48 AM
రాయ్‌పూర్, డిసెంబర్ 3 : వచ్చే ఏడాది జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత జ ట్టు ధరించే జెర్సీని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆవిష్కరించాడు. రాయ్‌పూర్ వన్డే బ్రేక్ టైమ్ లో ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. టీ20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసి డర్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ చేతుల మీదు గా జెర్సీని విడుదల చేసారు. ఈ కార్యక్రమం లో యువ ఆటగాడు తిలక్ వర్మ, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, జెర్సీ స్పాన్సర్ అపోలో టైర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారీ సైజ్ టీ20 ప్రపంచకప్ జెర్సీని గ్రౌండ్‌లో ప్రదర్శించారు. నీలిరంగులో ఉన్న జెర్సీ రెండు వైపులా ఆరెంజ్ ప్యానెల్స్, వర్టికల్ బ్లూ స్ట్రుప్స్ ఉన్నాయి. జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్న రోహిత్ 2024 టీ20 వరల్డ్ కప్ విజయాన్ని గుర్తు చేసుకున్నాడు. తొలి వరల్డ్‌కప్ గెలిచాక మళ్లీ ట్రోఫీ అందుకోవడానికి సుధీర్ఘ కాలం వేచి చూడా ల్సి వచ్చిందన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మరోసారి టైటిల్ నిలబెట్టుకోవాలని ఆకాంక్షించాడు.