calender_icon.png 23 December, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మక్క- సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

23-12-2025 01:42:00 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్, డిసెంబరు 22 (విజయ క్రాంతి): జనవరి 28 నుండి 31వ వరకు జిల్లాలో నిర్వహించనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్లో సమ్మక్క జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రదేశాల్లో అధికారులంతా సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. జాతర ప్రదేశాల్లో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలని, హైమాస్ లైట్ లు భారీ కేడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులు జాతర ప్రాంతాల్లో నీటి వసతి కల్పించాలని తెలిపారు. రేకుర్తి జాతర ప్రాంతంలో జాతర జరిగే రోజుల్లో ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటి నీరు విడుదల చేయాలని అన్నారు. ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. జాతర జరిగే రోజుల్లో 108 వాహనం, మందులు, డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు.

పోలీస్, రెవెన్యూ, విద్యుత్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, మున్సిపల్ తదితర శాఖ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. జాతర సమయాల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతరలో ఆపదమిత్ర వాలంటీర్ల సేవలు ఉపయోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో  పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్.సుప్రియ, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజు, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.