28-08-2025 06:28:27 PM
గ్రామపంచాయతీలలో ముసాయిదా ఓటర్, పోలీస్ స్టేషన్లు ప్రచురణ..
మండల ప్రజా పరిషత్ అధికారి యుగేందర్ రెడ్డి..
మునుగోడు (విజయక్రాంతి): ముసాయిదా ఓటర్, పోలింగ్ స్టేషన్ల జాబితాలపై అభ్యంతరాలను గడువు లోపల తెలియజేయాలని మండల ప్రజా పరిషత్ అధికారి యుగంధర్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మునుగోడు మండలంలోని అన్ని గ్రామాలలో మండల పరిషత్తు కార్యాలయంలో, వార్డు వారి గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ జాబితా, ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాలను కార్యాలయం సిబ్బంది గ్రామపంచాయతీల కార్యదర్శితో కలిసి ఆయా గ్రామాల పంచాయతీలో గోడలకు అతికించారు. 30వ తేదీ వరకు ఇట్టి జాబితాలపై అభ్యంతరాలను ఆయా గ్రామ పంచాయతీలలో స్వీకరిస్తారు. ఇట్టి విషయమై అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో తేదీ 30వ తేదీన ఎంపిడిఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.