calender_icon.png 29 August, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గట్టు మండల అభివృద్ధికి నీతి ఆయోగ్ ద్వారా రూ.70 లక్షలు మంజూరు

29-08-2025 01:13:05 AM

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కలెక్టర్ బి.యం. సంతోష్

గద్వాల, ఆగస్టు 28 ( విజయక్రాంతి ) : గట్టు మండల అభివృద్ధికి నీతి ఆయోగ్ ద్వారా మం జూరైన కోటి రూపాయల నిధుల నుండి 70 లక్షలతో అధునాతన భవన నిర్మాణం పనులను చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ లు అన్నారు.

గురువారం గట్టు మండల కేంద్రంలో నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గట్టు మండల అభివృద్ధికి విశేష కృషి చేసిన జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులకు స్థానిక శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు మెమెంటో, సర్టిఫికెట్లతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ భారత ప్రధాని 2023 లో దేశంలో అత్యంత వెనుకబడిన 500 మండలాలను గు ర్తించి, వాటి అభివృద్ధి కొరకు జిల్లాలోని గట్టు మండలాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు.

అప్పటి నుండి 32 సూచికలతో వివిధ రంగాలలో అభివృద్ధి పనులు చేపడుతూ 100 వ స్థానం నుండి దేశంలోనే ఐదవ స్థానానికి గట్టు మండలం తీసుకురావడం జరిగిందని అన్నారు. గట్టు మండలం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆనవాయితీగా ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఇక్కడి నుండే ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు.

మీరు చేసిన సేవలను దేశం గుర్తించి ఐదవ స్థానం కల్పించిందని, రాబోవు రోజులలో గట్టు మండలం రూపురేఖలు మార్చే విధంగా అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందుకు సాగుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు, ఎంపీడీవో చెన్నయ్య, తహసిల్దార్ విజయ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధి కారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, హెడ్మాస్టర్లు, ఏఎన్‌ఎం లు, అంగన్వాడీలు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.