calender_icon.png 29 August, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు ఆందోళన చెందవద్దు

29-08-2025 01:11:21 AM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

భూత్పూర్, ఆగస్టు 28 : యూరియా కోసం ఎవరు కూడా ఆందోళన చెందవద్దని అందరికీ యూరియాను అందజేస్తామని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం భూత్పూర్ మండల కేంద్రంలో రైతు ఆగ్రో సేవా కేంద్రం1 ను, శ్రీనివాస ట్రేడర్స్ ఫర్టి లైజర్ షాపు ను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు. యూరియా స్టాక్ రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించారు.

స్టాక్ 27 మెట్రిక్ టన్నుల చొప్పున వచ్చినట్లు రైతు ఆగ్రో సేవా కేంద్రం 1, శ్రీనివాస ట్రేడర్స్ డీలర్ కలెక్టర్ కు వివరించారు. రైతు వారి రిజిస్టర్ పరిశీలించి రైతు వారీ వివరాలు న మోదు చేయాలని సూచించారు. ఆన్ లైన్ ఈ పాస్ యంత్రం ద్వారా  సరఫరా ఓ టి.పి జనరేట్ చేస్తున్న విధానం పరిశీలించారు. కొన్ని సాంకేతిక సమస్యలు, సర్వర్ స్లో గా ఉండడం సమస్యలు వివరించారు.

సమస్య వస్తే రైతుల వివరాలు రైతు రిజిస్టర్ లో నమోదు చేసుకొని సరఫరా చేయాలని సూచించారు. అక్కడ క్యూ లో నిల్చున్న రైతులతో మాట్లాడారు. ప్రతి రైతుకు యూ రియా సరఫరా చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, రెండు బస్తాలు తీసుకు వెళ్లాలని స్టాక్ వచ్చిన విధంగా సరఫరా చేస్తామని వివరించారు. రైతులకు టోకెన్ లు జారీ చేసి క్రమ పద్ధతి లో ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వారికి త్రాగు నీరు అందించాలని, పోలీస్ అధికారుల సమన్వయం తో సరఫరా చేయాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారి యూరియా సరఫరా నిశితంగా పరిశీలించి పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపి.డిఓ ప్రభాకర్, తహశీల్దార్ కిషన్, మండల వ్యవసాయ అధికారి మురళి, తదితరులు ఉన్నారు.