calender_icon.png 26 November, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల రుణాలకు వడ్డీ చెల్లిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..

26-11-2025 12:22:11 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, నవంబరు 25 (విజయ క్రాంతి): మహిళలు బ్యాంకుల నుంచి తీసుకుంటున్న వడ్డీ లేని రుణాలకు సంబంధిం చిన వడ్డీ పైసలను క్రమం తప్పకుండ చెల్లిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మహిళల మిత్తి పైసల కోసమే 304 కోట్లు రిలీజ్ చేసిందని, అందులో కరీంనగర్ నియోజకవర్గానికి కోటి 20 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు.

మంగళవారం ఎంపీడీఓ ఆఫీసులో కరీంనగర్ నియోజక వర్గంలోని మహిళా సంఘ సభ్యులకు మంజూరైన వడ్డీ లేని రుణాల వడ్డీ డబ్బులకు సంబంధించిన 1.20 కోట్ల చెక్కును సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అందజేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో మహిళలకు పదేళ్లు మిత్తి పైసలు 4 వేల కోట్లు ఎగ్గొట్టారని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నాలుగైదు నెలలకోసారి మహిళలు తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీ పైసలను వారి అకౌంట్లలో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో మహేశ్వర్, డిపిఎం తిరుపతి,ఎంపిడివో సంజీవ రావు, ఏపిఎంలు, సిసి లు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.