23-10-2025 11:11:41 PM
నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా నవీపేట్ – బాసర్ రైల్వే స్టేషన్ ల మధ్య కి.మీ నెం. 432/9-432/7 వద్ద రైల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు రైలు కింద పడి 65 ఏళ్ల వృద్ధురాలు మృతిచెందినట్లు నిజామాబాద్ రైల్‌వే ఎస్ఐ హెచ్. సాయిరెడ్డి తెలిపారు. గురువారం రాత్రి 65 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందినట్లు నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ హరికృష్ణ ఇచ్చిన సమాచారం ప్రకారం కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ప్రమాదవశాత్తు గుర్తుతెలియని రైలు నుంచి కింద పడడంతో తీవ్ర గాయాలతో వృద్ధురాలు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిపారు. మృతురాలిని గుర్తించడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసి వృద్ధురాలి మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు రైల్వే ఎస్ఐ హెచ్. సాయిరెడ్డి వెల్లడించారు. మృతురాలిని ఎవరైనా గుర్తిస్తే రైల్వే హెడ్ కానిస్టేబుల్(199) ఎం. రవికుమార్, ఆర్ఓపీ బాసర్ 9493451642, ఎస్ఐ రైల్వే పోలీస్ నిజామాబాద్ 8712658591 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని రైల్వే సాయిరెడ్డి కోరారు.