05-11-2025 01:16:55 AM
- శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి) : తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో శాసన మండలి భవనం పునర్నిర్మాణ పనులను మండ లి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అతి త్వరలోనే భవన ప్రారంభోత్స వం ఉంటుందన్నారు. అనంతరం తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా. నరసింహా చార్యులు, ఆర్‌అండ్‌బీ, అగాఖాన్ సంస్థ, ఇతర అధికారులతో గుత్తా సుఖేందర్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలోనే నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. శాసన మండ లి నూతన సమావేశ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అతి త్వరలోనే నిర్వహించాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సూచించారని, తాజాగా ఇప్పటివరకు పూర్తయిన పనుల గురించి సీఎం ఆరా తీశారని తెలిపారు.