31-01-2026 02:16:44 AM
జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు జి.వీరారెడ్డి
నిర్మల్, జనవరి 30 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా తమ ఎన్నికల ఖర్చుల వివరాలను తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా సమర్పించాలని జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు జి. వీరారెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్తో కలిసి సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అభ్యర్థులకు ఎన్నికల వ్యయాలపై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అన్ని రకాల ఫారాలు, రిజిస్టర్లను సక్రమంగా పూరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు షుజావుద్దీన్, డీఈవో భోజన్న, డీసీఓ నర్సయ్య, అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.