calender_icon.png 31 January, 2026 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన విధ్యే ప్రభుత్వ లక్ష్యం

31-01-2026 02:14:49 AM

ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. మారుమూల గాదిగూడ మండలం అర్జుని గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆహార హారపదార్థాలను కలెక్టర్ రుచి చూసారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్ప నకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అలాగే గాదిగూడ మండలంలోని రహదారుల పరిస్థితిని మెరుగుపరిచి, ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. గ్రామంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారు నికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని, గృహ నిర్మాణ పథకాన్ని పార దర్శకంగా అమలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కమలాబాయి, పటేల్ రావుజీ పటేల్, తహసిల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపిఓ గంగాధర్, ఏంఈఓ రమేష్, ప్రధానోపాధ్యాయులు మెస్రం శేఖర్, రాయ్ సెంటర్ సార్ మేడి మండాడి దౌలత్ రావు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.