calender_icon.png 18 August, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటేల్ గూడెం గ్రామంలో నూతన కుమ్మరి సంఘం కమిటీ ఎన్నిక

18-08-2025 12:23:59 AM

ఆలేరు, ఆగస్టు 17 (విజయ క్రాంతి):   యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పటేల్ గూడెం గ్రామంలో, జిల్లా కన్వీనర్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, కో-కన్వీనర్ ఓుంగంటి గోపాల్ ఆదేశాల మేరకు, ఆదివారం రోజున తెలంగాణ రాష్ర్ట కుమ్మరి సంఘం (నమోదు సంఖ్య: 87/2018 %--% తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం గుర్తింపు పొందిన సంఘం) ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలేరు మండల కన్వీనర్ గంగదారి సుధీర్ కుమార్ కో కన్వీనర్ కొరుటూరు ఉపేందర్, కో-కన్వీనర్ జీవిలికపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. వారి సమక్షంలో నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు తాడూరి గణేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి సంపత్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

కార్యక్రమంలో గంగాధారి మహేందర్, విజ్జగిరి లక్ష్మీనారాయణ, శ్రవణ్ కుమార్, కిరణ్ కుమార్,  తాడూరి భల భూచయ్య, బాల్ నర్సయ్య, రాములు, చంద్రశేఖర్, బాలరాజు, మధు, రాజశేఖర్, నాగరాజు, భానుచెందర్, నాగయ్యపల్లి ప్రసాద్, నాగయ్యపల్లి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.