25-12-2025 01:56:03 AM
ప్రారంభించిన పోలీస్ కమిషనర్ జీ. సుధీర్ బాబు
కుషాయిగూడ, డిసెంబర్ 24 (విజయక్రాంతి) : వృద్ధుల సహాయం, సంరక్షణ లక్ష్యంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో గోల్డెన్ కేర్ కార్యక్రమంలో భాగంగా కుషాయిగూడలోని లక్ష్మీ గార్డెన్స్ కన్వెన్షన్ హాల్లో మూడో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం 9 గం టల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో మొత్తం 245 మంది వృద్ధులకు సమగ్ర వైద్య సేవలు అందించారు.
పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు శిబిరాన్ని ప్రారంభించి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జెమ్కేర్ పౌలోమీ, సోలి ఐ కేర్, సౌజన్య డెంటల్, మా ఈఎన్టీ ఆసుపత్రుల సహకారంతో జనరల్ మెడిసిన్, హృదయ వైద్యం, ఎముకల వైద్యం, దంత వైద్యం, కంటి వైద్యం విభాగాలకు చెందిన నిపుణ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి పరీక్షలను ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ సిహెచ్ శ్రీధర్, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషారాణి, అడిషనల్ డీసీపీ వెం కట రమణ, కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి, ఉమెన్ సేఫ్టీ ఏసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
శిబిర నిర్వహణలో ఆర్కేఎస్సీ జాయింట్ సెక్రటరీ రాధికానాథ్, చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రి, కుషాయిగూడ ఎస్హెచ్వో. భాస్కర్ రెడ్డి ఎస్‌ఐలు నిమ్మ సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ సాయిలు వెంకన్న కుషాయిగూడ మహిళా కానిస్టేబుల్ ఆయా పోలీస్ స్టేషన్లో సిబ్బంది పాల్గొని వృద్ధులకు సేవలు అం దించారు. సూర్యనారాయణతో పాటు నెరేడ్మెట్, జవహర్నగర్, కీసర స్టేషన్ల ఎస్హెచ్వోలు, కీలక పాత్ర పోషించారు. వృద్ధుల సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉం టుందని అధికారులు తెలిపారు. ఒకే చోట అన్ని వైద్య సదుపాయాలు అందించినందుకు లబ్ధిదారులు పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.