calender_icon.png 6 July, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ మండల నూతనబాడీ ఎన్నిక

15-06-2025 06:48:36 PM

సీపీఐ 12వ మండల మహాసభ..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి మండల 12వ మహాసభను కా బాసెట్టి గంగారం భవన్లో ఆదివారం నిర్వహించారు. మాజీ సర్పంచ్, సిపిఐ సీనియర్ నాయకులు మూల శంకర్ గౌడ్(Senior CPI leader Moola Shankar Goud)  జెండా ఆవిష్కరణ చేసి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సమితి సభ్యులు మేకల రాజేశం అధ్యక్షతన వహించారు. ఈ మహా సభలో మండల నూతన బాడీని ఎన్నుకున్నారు. నూతన మండల కార్యదర్శిగా బొంతల లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శిలుగా మేకల తిరుపతి, గోమాస గంగారం, కోశాధికారిగా మీణుగు లక్ష్మీనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లంపూర్ణిమ, రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్ పాల్గొన్నారు. నూతన మండల సమితిని ప్రకటించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. బెల్లంపల్లి మండల సమగ్ర అభివృద్ధికోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు నాన్యత పాటించకపోవడంపై విచారణ చేసి దోశులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు గ్రామ సభల ద్వారా ఎన్నిక చేసి రాజీవ్ యువ వికాస స్కీమ్ అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ లోన్ మంజూరు చేయాలన్నారు.

రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారి డిసిగ్నేషన్ తెలిపే నేమ్ ప్లేట్ ఉండాలని, ఏ సర్టిఫికెట్స్ ఎన్ని రోజులకు ఇస్తారని తెలిపే బోర్డులను పెట్టాలని కోరారు.  బెల్లంపల్లి మండలంలో కన్నాల శివారులో గత కొన్ని సంవత్సరాలుగా భూకబ్జాలు విపరీతంగా పెరిగిపోవడం, రియల్ ఎస్టేట్ వెంచర్ల వల్ల ప్రభుత్వ, సింగరేణి భూములు అన్యక్రాంతమైనవని, అట్టి భూములను కాపాడడానికి హైడ్రా కమిషనర్ ను ఏర్పాటు చేసి భూములను కాపాడాలని కోరారు. 

బెల్లంపల్లి మండలంలోని గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా ప్రచారం చేసిన ఆరు గ్యారెంటీ హామీలను వెంటనే అమలు చేయాలని ఈ మహాసభలలో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, బికేఎంయు జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం, డీ హెచ్ పీ ఎస్ జిల్లా అధ్యక్షుడు డిఆర్ శ్రీధర్, బెల్లంపల్లి పట్టణ సహాయ కార్యదర్శి తిలక్ అంబేద్కర్, నాయకులు బియ్యాల ఉపేందర్, పొలసాని సహదేవరావు ,జూపాక సరోజ, బుడిమే వెంకటేష్, కందుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.