calender_icon.png 1 October, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్య సత్రం నూతన కార్యవర్గం ఎన్నిక

01-10-2025 12:03:38 AM

అధ్యక్షుడిగా గట్టు మహేశ్‌బాబు రెండోసారి ఏకగ్రీవం

వరంగల్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): వరంగల్, రామన్నపేటలోని ఆర్యవైశ్య సత్రం, కార్యనిర్వహణకుగాను ఆధ్యాత్మికవేత్త తాటిపల్లి రాజేశ్వర్‌రావ్ పర్యవేక్షణలో 2025 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం జరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు గట్టు మహేశ్‌బాబు రెండోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గట్టు మహేష్‌బాబు మాట్లాడుతూ.. తెలంగాణాలోనే అతి సుందరంగా అన్ని వసతులతో 4 ఎయిర్ కండిషన్డ్ ఫంక్షన్ హాల్స్ కలిగిన ఏకైక భవనం తమదేనన్నారు.

అవసరమున్న వారికి అతి తక్కువ రుసుముతో వైష్యులకు అందిస్తూ, ఇంకా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో రెండు ఫంక్షన్ హాల్స్‌లో 25 శాతం ప్రత్యేక రాయితీతో అందిస్తున్నామని చెప్పారు. ప్రధాన కార్యదర్శిగా గంపా అమర్‌నాథ్, కోశాధికారిగా పడిశాల నాగరాజు, ఉపాధ్యక్షుడిగా పెద్ది ప్రభాకర్, సంయుక్త కార్యదర్శిగా సోమరామయ్య, సభ్యులుగా గోరంటల యాదగిరి బ్రహ్మ దేవర సోమలింగం, తాటికొండ చక్రపాణి, తాటిపల్లి రాజేశ్వర్‌రావు, పిన్న మోహన్‌రావు, తోట సోమేశ్వర్, డాక్టర్ బచ్చు మురళికృష్ణ, నాగబండి నర్సింహా రావు, కాసం నమశ్శివాయ, బజ్జరీ వైకుంఠం, గుండా సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.