calender_icon.png 1 October, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందూ శ్మశానవాటికలో దహనం చేసే ఫ్లాట్ ఫారమ్స్‌ను పెంచాలని వినతి

01-10-2025 12:04:03 AM

సూర్యాపేట, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని సద్దలచెరువుకు ఆనుకోని ఉన్న హిందూ స్మశాన వాటికలో దహనం చేసే ఫ్లాట్ఫామ్స్, వైకుంఠ రథాలను పెంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో మున్సిపల్ ప్రత్యేక అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ కె.సీతరామరావుకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న ఐదెకరాల పాత స్మశాన వాటిక స్థలంలోనే కేంద్రం ఇచ్చిన అమృత్ సీటి నిధులతో కొత్తగా స్మశానవాటిక నిర్మాణం చేయడం జరిగిందన్నారు. పాత స్మశాన వాటికలో దహన సంస్కారాల కోసం ఆరు ఫ్లాట్ ఫారమ్స్ ఉండగా ప్రస్తుతం మూడు మాత్రమే ఉన్నాయన్నారు. గతంలో సూర్యాపేటలో 2లక్షల జనాభా ఉండగా ప్రస్తుతం 10 విలీన గ్రామాలు కలవడంతో పట్టన జనా భా సుమారు రెండున్నర లక్షల కు పెరిగిందన్నారు.

పట్టణంలో 80శాతం హిందూ జనాభా ఉండడంతో హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలైన 3, 5వ రోజుల్లో ఆస్థికలు, బూడిదను ఎత్తిపోస్తారని అప్పటి వరకు ఫ్లాట్ఫామ్స్ ఖాళీ కావన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న మూడు ప్లాట్ ఫారమ్ లతో పాటు మరో ఐదు అదనంగా ఏర్పాటు చేయాలన్నారు.

అలాగే చనిపోయిన వారిని అంత్యక్రియలకు స్మశాన వాటికకు తీసుకొచ్చేందుకు మున్సిపాల్టీ నుంచి ఒకే వైకుంఠరథం ఉండడంతో ఒకే రోజు ముగ్గురు చనిపోతే ఒకే రథంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల్ల నర్సింహ్మ, రాష్ట్ర వానరసేన అధ్యక్షులు మహేశ్వరం రవిచంద్ర, జుట్టుకొండ అజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.