calender_icon.png 8 January, 2026 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివ్వంపేట మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

06-01-2026 09:17:58 PM

అధ్యక్షులుగా కల్లూరి హనుమంతరావు

శివంపేట్,(విజయక్రాంతి): శివ్వంపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎద్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్ కల్లూరి హనుమంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా తాటి పవన్ గుప్తా ఎన్నికయ్యారు. మంగళవారం చండి గ్రామ శివారులోని జెఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో మండల పరిధిలోని నూతనంగా ఎన్నికైన సర్పంచులు పాల్గొన్నారు.

గౌరవ అధ్యక్షుడిగా ఏనుగు అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎం. సుజాత కృష్ణారెడ్డి, ఎల్.తేజస్విని రాజేందర్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా గైని బైటి ప్రవీణ్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణ గౌడ్ మరియు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఉపసర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.