calender_icon.png 8 January, 2026 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయిలో మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

06-01-2026 09:13:29 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ మాథ్స్ ఫోరమ్ (TMF) ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ TG మోడల్ స్కూల్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షలో PMSHRI TGMS మంచిర్యాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న తెలిపారు.

రాష్ట్రస్థాయి పరీక్షలో మోడల్ స్కూల్ విద్యార్థులు శ్రీ సాయి హర్ష మొదటి బహుమతి, సాహిత్య రెండవ బహుమతి సాధించారన్నారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంచిర్యాల DEO యాదయ్య, MEO మాళవి దేవి, PMSHRI TGMS గణిత ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.