calender_icon.png 27 August, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఆర్‌టీయూ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

27-08-2025 12:14:07 AM

మంచిర్యాల, ఆగస్టు 26 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా పిఆర్‌టియు తెలంగాణ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా దరణికోట వేణుగోపాల్, సూరినేని గంగాధర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర క్రమశిక్షణ కమిటి ఉపాధ్యక్షులు వీర శంకర్ ఎన్నికల అధికారిగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిసిఇబి సెక్రెటరి మహేశ్వర్ రెడ్డి, జైపూర్ ఎమ్‌ఈఒ బి శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కొత్త సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ, సంఘర్స్ రాజేశ్వరరావు, సుధీర్ రావు, లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి బొడ్డుపెల్లి శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు, మీడియా సెల్ కన్వీనర్  అడ్డిచర్ల సాగర్, జిల్లా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు కావిరి సాంబయ్య, జి రామ్మోహన్ రావు, పానుగంటి లక్ష్మణ్, 18 మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, మండల నాయకులు, ప్రాథమిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.