27-11-2025 08:20:20 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ పరిధిలోనీ చింతల్‌నాగారం నుంచి ఫిల్టర్ బెడ్ వరకు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న మెటల్ రోడ్ పనులకు గురువారం అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు భూమిపూజ చేశారు. కొనసాగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం అమృత్ 2.0 పథకంలో భాగంగా పట్టణంలో కొనసాగుతున్న తాగునీటి పైపులైన్ పనులను పరిశీలించారు. పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ ఛైర్మన్ గంగాధర్, సొసైటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, జిల్లా యువజన అధ్యక్షుడు మధుసూదన్, దాసరి శ్రీను, గౌస్ తదితరులు పాల్గొన్నారు.