calender_icon.png 27 November, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్ అంశాలపై ప్రత్యేక అవగాహన

27-11-2025 08:09:52 PM

గద్వాల: గద్వాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మాన్ ఆర్గనైజేషన్ (హైదరాబాద్) వారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు ఉద్యోగ అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఇంటర్వ్యూ స్కిల్స్ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ టీ. రామ్మోహన్ ముఖ్య అథిదిగా హాజరై మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం సాంకేతిక విద్యతో పాటు కమ్యూనికేషన్ మరియు వ్యక్తిగత నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు సాధించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఈ అవగాహన సదస్సును విజయవంతం చేశారు.