calender_icon.png 27 November, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి

27-11-2025 08:11:28 PM

జిల్లా వ్యయ పరిశీలకులు రాజేష్ బాబు

గద్వాల : గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయు ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ఓపెన్ చేసేలా ఏఈఓ (అసిస్టెంట్ ఎక్స్పెండచర్ అబ్జర్వర్) లు తగు సూచనలు చేయాలని జిల్లా వ్యయ పరిశీలకులు రాజేష్ బాబు అన్నారు.  గురువారం ఐడిఓసి లోని మినీ మీటింగ్ హాల్లో సర్పంచ్ ఎన్నికల వ్యయానికి సంబంధించి ఆయా మండలాల ఏఈఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు తో కలిసి శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తాను నామినేషన్ వేసిన తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీ వరకు ఎన్నికల్లో ఖర్చుపెట్టిన వివరాలను తాను స్వయంగా కానీ, ఎన్నికల ఏజెంట్ ద్వారా కానీ సరైన ఖాతాను నిర్వహించాలన్నారు.  2011 జనాభా లెక్కల ప్రకారం 5000, అంతకుమించి జనాభా గల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి గరిష్టంగా రూ.2.50 లక్షలలోపు, వార్డు అభ్యర్థి రూ.50,000 లోపు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. 5000 కంటే తక్కువ జనాభా గల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షల లోపు, వార్డు అభ్యర్థి రూ .30,000 లోపు ఖర్చు చేయాలన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్స్ వ్యయానికి సంబంధించి వివిధ అంశాలపై శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి రమేష్ బాబు, జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.