calender_icon.png 2 August, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజీ సిద్ధం

01-08-2025 12:00:00 AM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 31: భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎన్నికకు సంబంధించి ఎలక్టోరల్ కాలేజీ సిద్ధమైనట్టు పేర్కొం ది. ఈ మేరకు గురువారం ఈసీ ఒక ట్వీట్ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 (1) ప్రకారం భారత ఉపరాష్ట్రపతిని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది.

ప్రస్తుతం పార్లమెంట్‌లో ఉభ య సభలు కలిపి 788 మంది సభ్యులు ఓ టింగ్‌లో పాల్గొననున్నారు. దీని ప్రకారం ఉ పరాష్ట్రపతి ఎన్నిక కోసం సంబంధిత సభలు రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాం తం ఆధారంగా అక్షరక్రమానుసారం ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేసినట్టు ఎన్నికల సం ఘం అసిస్టెంట్ డైరెక్టర్ అపూర్వ కుమార్ సింగ్ పేర్కొన్నారు.

నోటిఫికేషన్ తేదీ వెలువడిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పా టు చేసిన కౌంటర్‌లో ఈ ఎలక్టోరల్ కాలేజీ జాబితా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. త్వరలోనే ఎన్నిక నోటిఫికేషన్ జా రీ అవుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.