18-11-2025 07:50:53 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 26వ డివిజన్ లో ప్రజాబాట కార్యక్రమాన్ని విద్యుత్ అధికారులు నిర్వహించారు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ చక్రపాణి, మాజీ మేయర్ అమర్ సింగ్, 26వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి కాలనీ ప్రజలతో కలిసి డివిజన్ లోని వివిధ సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలని, అవసరమైన దగ్గర ఇప్పుడు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ల కెపాసిటీని పెంచిలో వోల్టేజి సమస్యకి చెక్ పెట్టాలని విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని వారు ఆదేశించారు.