calender_icon.png 18 November, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బదిలీ వర్కర్స్ కు జనరల్ అసిస్టెంట్ గా పదోన్నతుల పత్రాలు అందచేత

18-11-2025 07:51:36 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కాసిపేట 1 ఇంక్లైన్ గనిలో బదిలీ వర్కర్స్ గా పనిచేసి జనరల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన 14 మంది ఉద్యోగులకు మంగళవారం పదోన్నతి పత్రాలను మేనేజర్ సతీష్, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ అందచేశారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులు క్రమశిక్షణతో, నైపుణ్యంతో పని సీజేసి సంస్థకు మంచిపేరు తేవాలని, రక్షణతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిట్ సెక్రెటరీ మీనుగు లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీశాన్, హిమాలయ, బన్న లక్ష్మన్ దాస్, రాజేందర్, సురేష్, రఘురామ్ పాల్గొన్నారు.

నాణ్యత వారోత్సవాల విజేతలకు బహుమతులు ప్రధానం

బొగ్గు నాణ్యత వారోత్సవాలలో భాగంగా ఉద్యోగులకు నాణ్యతపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన క్విజ్ పోటీలలో విజేతలు ఎర్రవెల్లి శంకర్ కు మొదటి బహుమతి, బాలకిషన్ కు రెండవ బహుమతి, సంతోష్ కు మూడవ బహుమతి కాన్సులేషన్ బహుమతి అశోక్ కి మేనేజర్ సతీష్, దాగం మల్లేష్, మీనుగు లక్ష్మీనారాయణ అందచేశారు.