02-09-2025 12:38:50 AM
ఉచితంగా కనెక్షన్ ఇవ్వాలంటున్న పేదలు
మెదక్, సెప్టెంబర్ 1(విజయక్రాంతి):నిరుపేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత వి ద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఇందిర మ్మ ఇళ్లకు ఉచిత కనెక్షన్ ఇచ్చేందుకు వెనకడుగు వేస్తోంది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు అయినా, సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి కేటగిరి-1 విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కమర్షియల్ అయితే కేటగిరి-2 ఇస్తారు. అయితే ఇల్లు కట్టడం కన్నా విద్యుత్ కనెక్షన్ కోసం ముందుగా అప్పులు చేయా ల్సి వస్తోందని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు వాపోతున్నారు.
ఉచితంగా కనెక్షన్ ఇవ్వాలి..
గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇం దిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలతో నిర్మించిన ఇళ్లకు నామమా త్రపు రుసుముతో విద్యుత్ కనెక్షన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని, డబ్బులు చెల్లిస్తేనే కనెక్షన్ ఇస్తామని అధికారులు అం టున్నారు. కాగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ని ఆయా మండలాల పరిధిలో లక్షలాది దరఖాస్తులు వచ్చాయి.
ఇందులో మొదటి విడ తలో మంజూరైన ఇండ్లలో పాత ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకుంటున్న వారు కొందరైతే... కొత్త స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారు మరికొందరు ఉన్నారు. పాత ఇంటి స్థలంలో నిర్మించుకునే వారికి పాత మీటరు కొనసాగింపు ఉంటుంది.
అయితే ఇల్లు నిర్మాణం మొదలు పెట్టి బేస్మెంట్ లెవ ల్ వరకు నిర్మాణం పూర్తి చేస్తే రూ. లక్ష, స్లా బ్ వరకు గోడల నిర్మాణానికి రూ. లక్ష. స్లాబ్ పడిన తర్వాత రూ.2 లక్షలు, ఇల్లు పూర్తి అ యిన తర్వాత మిగిలిన రూ.లక్ష ఇలామెత్తం రూ.5 లక్షలు చెల్లిస్తారు. కాగా లబ్దిదారులు ముందు అప్పు లు చేసి ఇంటి నిర్మాణాలు మొదలు పెడుతున్నారు. వాటికి తోడు ఇప్పుడు కరెం ట్ ఖర్చులు అధికం అవుతున్నాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
మీటరుకు అదపు ఖర్చులు..
ఇందిరమ్మ ఇండ్లకు కరెంట్ మీటరుకు అదనపు భారం పడుతుందని లబ్దిదారులు వాపోతున్నారు. గృహ అవసరమైన విద్యుత్ వినియోగం కోసం కేజీ వాట్స్ విద్యుత్ కోసం కేటగిరీ-1 అయితే డెవలప్మెంట్ చార్జీ లు కలిపి రూ.28,00, కేటగిరీ-2 అయితే రూ.3800 మీసేవలో చలాన్ చెల్లించాలి. అది తీసుకొని విద్యుత్ అధికారుల వద్దకు వస్తే అక్కడ పరిస్థితులను బట్టి మరో రూ. వెయ్యి నుంచి రూ. 2వేల మేరకు ఖర్చు అవుతుందని వినియోగదారులు అంటున్నారు.
విద్యుత్ స్తంభం దూరంగా ఉంటే 30 మీటర్లకు ఒక పోల్ చొప్పున వైర్లు, కాసారాలకు ఇతర పరికరాలకు రూ.6 వేల మేరకు చెల్లించాలి. ఐదారు పోల్స్ దూరం అయితే వి ద్యుత్ కనెక్షన్, పోల్స్, ఇతర విద్యుత్ పరికరాలకు చాలా వరకు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశంఉంది.
కేటగిరి -1 మీటరు ఇస్తాం..
ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న లబ్దిదారులు విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చేవా రికి కేటగిరి-1 మీటరు మాత్రమే ఇస్తా ము. కేటగిరి -2 కేవలం వ్యాపార అవసరాలకు ఇస్తాం. మీటర్కు అవసరమయ్యే రుసుము డీడీ రూపంలో చెల్లించాలి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కొనసాగుతుంది. ఆపై వస్తే బిల్లు చెల్లించాల్సిందే.
నారాయణ నాయక్, ఎస్‌ఈ, ట్రాన్స్కో మెదక్