24-08-2025 12:13:35 AM
-రైనాలజీ అండ్ స్కల్ బేస్‌సర్జరీలో అంతర్జాతీయ నిపుణుల అనుభవాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): హైటెక్‌సిటీ మెడికవర్ హాస్పి టల్స్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని టీహబ్‌లో ఎలివేట్ ఈఎన్‌టీ సమ్మి ట్2025 రెండో ఎడిషన్‌ను నిర్వహించా రు. ‘రైనాలజీ అండ్ స్కల్ బేస్ సర్జరీ: ఫండమెంటల్స్ టు ది ఫ్రంటియర్’ అనే ఇతివృ త్తంతో రెండురోజుల పాటు సీఎమ్‌ఈ (కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్) ప్రోగ్రా మ్‌కు మెడికవర్ రూపకల్పన చేసింది.
ఈ సందర్భంగా అనేకమంది జాతీయ, అంతర్జాతీయ నిపుణులు తాజా పరిణామాలను పం చుకున్నారు. సమ్మిట్‌లో డాక్టర్ ఇయాకోపో డల్లాన్ ‘ట్రాన్స్‌ఆర్బిటల్ అప్రోచెస్’పై చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా క్టర్ శరత్‌రెడ్డి మాట్లాడుతూ మెడికవర్‌లో నిరంతర విద్యాసంస్కృతిని పెంపొందించడ మే తమ లక్ష్యమన్నారు.
వైద్యులు అంతర్జాతీయస్థాయి వైద్యజ్ఞానాన్ని అం దుకున్నప్పు డు దాని అంతిమ ప్రయోజనం రోగులకు అందుతుందని చెప్పారు. సమ్మిట్ ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్, మెడికవర్ హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ సంపూర్ణా ఘోష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం రైనాలజీ, అన్టీరియర్ స్కల్ బేస్ సర్జరీపై ప్రత్యేక దృష్టిని సారించడానికి నిపుణులను ఒక వేదికపైకి తీసుకొచ్చినట్టు చెప్పారు. సమ్మిట్‌లో డాక్టర్ నారాయణ జయశంకర్, డాక్టర్ నిషి త్ జేషా, డాక్టర్ అమిత్ కేశ్రి, డాక్టర్ దీన్‌దయాళ్, డాక్టర్ శ్రీనివాస్ కిశోర్, డాక్టర్ శ్రీకాం త్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు.