07-01-2026 06:41:02 PM
- జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు
కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం చైర్‌పర్సన్‌గా మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామకమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆమోదం తెలిపారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే.సి. వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంపై డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన ఏఐసీసీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టీపీసీసీ పరిధిలో ఏఐసీసీ ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల హక్కులు, అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
- జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా కవ్వంపల్లి సత్యనారాయణ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.