calender_icon.png 24 November, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధులను బాధ్యతగా నిర్వర్తించండి

24-11-2025 12:00:00 AM

డి.ఎస్.పి శివరాంరెడ్డి

నకిరేకల్ నవంబర్23 : పోలీస్‌శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ బాధ్యతగా విధులను నిర్వర్తించాలని నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి అన్నారు. ఆదివారం కట్టంగూర్ పోలీస్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలానికి సంబంధించిన  పలు రికార్డులను, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, అక్రమ ఇసుక రవాణా, పిడిఎస్ బియ్యం సరఫరా చేసేవారిపై అప్రమత్తం ఉండి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

పెట్రోలింగ్ సమయంలో రౌడీ షీటర్ల పై నిరంతర నిఘా , స్టేషన్ పరిధిలో సీసీటీవీ పర్యవేక్షణను మరింత విస్తరించాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ లోడింగ్ ,వేగం అతిక్రమణపై ప్రత్యేక డ్రైవ్ లను కొనసాగించాలని ఆయన సూచించారు . గ్రామ పోలీస్ అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి  సేవలను సమర్ధవంతంగా అందించాలని సూచించారు.

అనంతరం సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విధుల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న సిబ్బందిని శాలువాతో ఆయన సత్కరించి అభినందించారు . పోలీసు స్టేషన్ ప్రాంగణంలో   ఆయన మొక్కలును  నాటారు. ఈ కార్యక్రమంలో శాలిగౌరారం సిఐ కొండల్ రెడ్డి కట్టంగూర్ ఎస్త్స్ర మునుగోటి రవీందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.