calender_icon.png 19 November, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులు వారానికి 72 గంటలు పనిచేయాల్సిందే!

19-11-2025 12:13:50 AM

  1. చైనా తరహాలో ‘996’ పనివిధానం అమలు కావాలి

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఉద్ఘాటన

మండిపడుతున్న నెటిజన్లు

బెంగళూరు, నవంబర్ 28: భారత ఉద్యోగులు వారానికి 72 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయ ణమూర్తి మరోసారి ఉద్ఘాటించారు. ఇవే వ్యాఖ్యలు ఆయన గతంలోనూ చేశారు. తాజాగా ఓ సదస్సులో ఆయన ఆ వ్యాఖ్యలను మళ్లీ సమర్థించుకున్నారు. దేశాన్ని  అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో నిలపాలంటే, 996 నియమం పాటించాల్సిందేనని నొక్కిచెప్పారు.

ప్రస్తుతం చైనాలో ఈ విధా నం అమలులో ఉందన్నారు. ఉద్యోగి ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేస్తున్నారని, ఇదే నియ మం వారంలో ఆరు రోజులు (మొత్తం పనిగంటలు 72 గంటలు) పాటిస్తున్నారని పే ర్కొన్నారు. భారత వృద్ధి 6.57 శాతం ఉంద ని, అంతకు ఆరు రెట్లు ఎక్కువగా ఉన్న చైన వృద్ధిరేటును అధిగమించాల్సిన అవసరం ఉంద ని అభిప్రాయపడ్డారు.

నారాయణమూర్తి వ్యా ఖ్యలపై నెటిజన్లు మరోసారి విరుచుకుపడుతు న్నారు. ‘నారాయణమూ ర్తి సర్.. ముం దు మీరు మీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చైనా స్థాయి వేతనాలు ఇవ్వండి. వారికి మౌలిక సదుపాయాలు కల్పించండి. ఆ తర్వాత 72 పని గంటల గు రించి మాట్లాడుకుందాం’ అని ఒక నెటిజన్ సోషల్‌మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

‘భారత ఉద్యోగులు సంపాదించే వేతనాలు అద్దె, కిరాణా సామగ్రి, పిల్లల ఫీజులు, పెట్రోల్‌కు కూడా సరిపోవు’ అని ఓ యువతి ప్రశ్నించింది. ‘ఐరోపా దేశాల్లో ఉద్యోగులు ఉదయం 10 గంటలకు ఆఫీసులకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు తిరిగి వస్తారు. వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేస్తారు. అయినప్పటికీ, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది’ అని మరో నెటిజన్ స్పందించారు.