24-05-2025 12:13:53 AM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట.మే 23(విజయ క్రాంతి) : రాజీవ్ యువ వికాసం ద్వారా అనేకమంది ఉపాధి పొందుతారని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం రాజీవ్ వికాసం పథకం పర్చేజ్ కమిటీ ఫర్ అల్ కార్పొరేషన్స్, సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ హాజరు కాగా జిల్లా కలెక్టర్ జిల్లా పర్చేజ్ కమిటీ,డిస్కస్ డిపార్ట్మెంట్ వైస్,డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పర్చేజ్ కమిటీ ఉంటుందని అగ్రికల్చర్ హార్టికల్చర్, పశు సంవర్త శాఖ, ట్రాన్స్పోర్ట్, రిటైల్ షాప్ సర్వీసెస్, కమిటీ ఫర్ మణు్ఫాక్చరింగ్,ఫిషరీస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ తదితర శాఖలు కమిటీ ఉన్నాయి అని తెలిపారు.
రాజీవ్ యు వికాసం దరఖాస్తుదారులకి ఫైనాన్షియల్ అసిస్టెంట్, గ్రౌండింగ్ తదితర వాటిపై సమావేశం లో సమీక్షా నిర్వహించారు.ఈ సమావేశంలో ఈ. డి. ఎస్. సి. కార్పొరేషన్ అబ్దుల్ ఖలీల్,యల్. డి. ఎం. విజయ్, జడ్. పి. సి. ఈ. ఓ. మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.