calender_icon.png 10 November, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృత్తి విద్యతో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి

10-11-2025 12:36:03 AM

హనుమకొండ అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి

హనుమకొండ టౌన్, నవంబర్ 9 (విజయక్రాంతి) : వృత్తి విద్యలో శిక్షణ పొందిన యువతీ, యువకులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మర్కజీ వారు తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష వారి సౌజన్యంతో ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల హనుమకొండలో జాబ్ మేళాను ఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదవడం ద్వారా మాత్రమే కాకుండా వృత్తి విద్యలను అభ్యసించడం ద్వారా కూడా యువత నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చునని తెలిపారు.

ఈ జాబ్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమం లో ప్రభుత్వ మర్కజీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వి. రామారావు అధ్యక్షత వహించారు. రాష్ట్ర వృత్తి విద్య ఆర్డినేటర్ బి నాగేశ్వరరావు లు మాట్లాడుతూ 1200 మంది నిరుద్యోగ యువత ఉద్యోగం కొరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతీ రాష్ట్రంలో సమగ్ర శిక్ష పరిధిలో వివిధ ప్రభుత్వ పాఠశాలలో వృత్తి విద్యను అభ్యసించిన యువతీ, యువకులకు ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం కొరకు 24 ప్రైవేట్ కంపెనీలు ఇక్కడికి వచ్చాయని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఏంఓ డాక్టర్ బి. మన్మోహన్, హనుమకొండ మండల విద్యాశాఖ అధికారి జి.నెహ్రూ నాయక్, ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వి. జగన్నాథం, వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ఒకేషనల్ టీచర్స్, ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు, ఎన్సిసి క్యాడెట్లు అధిక సంఖ్యలో ఉద్యోగార్థులు పాల్గొన్నారు.కార్యక్రమంలో వివిధ కంపెనీలకు ఎంపికైన 214 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారందరు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లోని వృత్తి విద్యను అభ్యసించడమే ఈనాటి మా విజయానికి కారణమని పేర్కొన్నారు.