calender_icon.png 10 November, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ గెలుపుతోనే అభివృద్ధి

10-11-2025 12:35:10 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): గత 12 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, ఈ ఉపఎ న్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆయన, ప్రచార చివరి రోజున ఆదివారం డివిజన్‌లో సుడిగాలి పర్యటన చేపట్టారు.

కార్మిక నగర్, బ్రహ్మ శంకర్ నగర్, రామిరెడ్డి నగర్ ప్రాం తాల్లో ప్రచారం చేశారు. రహమత్‌నగర్ నుంచి బోరబండ వరకు నిర్వహించిన భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయక త్వంలో గడిచిన 23 నెలలుగా తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి, ఈ ప్రాంతానికి సుపరిచితుడైన యువకుడు నవీన్ యాదవ్‌కు అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలి అని కోరారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకే సంపన్నుల నియోజకవర్గం. వాస్తవానికి ఇక్కడ మెజారిటీగా ఉన్నది బడుగు, బలహీన, నిరుపేదలే. వీరి సంక్షేమాన్ని పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఏనాడూ పట్టించుకోలేదు అని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును గుర్తించి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మంత్రి పేరుపేరునా విజ్ఞప్తి చేశారు.