18-09-2025 12:43:08 AM
ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 12 మంది నక్సలైట్లు
గడ్చిరోలి, సెప్టెంబర్ 17: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎట్పల్లి తహసిల్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. గట్టా పీఎస్ పరిధిలోని మొడాస్కేలో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో బలగాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి.
మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు లభించాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పుర్ జిల్లాలో 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు.