calender_icon.png 19 July, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్

19-07-2025 12:47:48 AM

  1. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో ఎదురుకాల్పులు
  2. అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్
  3. ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం

నారాయణ్‌పూర్, జూలై 18: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మ ధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మా వోయిస్టులు మృతి చెందారు. అబుజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని ప క్కా సమాచారం అందడంతో శుక్రవారం ఛత్తీస్‌గఢ్ పోలీసులు, భద్రతా బలగాలు కలి సి సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.

ఈ సందర్భంగా శుక్రవారం మధ్యా హ్నం మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఏకే-47/ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను, నిత్యావసర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతున్నట్టు భద్రతా బలగాలు ప్రకటించాయి.

ఓవైపు లొంగుబాట్లు, మరోవైపు ఎన్‌కౌంటర్‌లతో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దశ అంతానికి వచ్చింది. ఆపరేషన్ కగార్‌తో భద్రతా బలగాలు మావోయిస్టుల్ని తుడిచిపెడుతున్నాయి. మార్చి 31, 2026 నాటికి దేశంలో నక్సలిజం నుంచి విముక్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.