19-07-2025 12:43:59 AM
న్యూఢిల్లీ, జూలై 18: టాటా సన్స్ అండ్ టాటా ట్రస్ట్స్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృ తుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 500 కోట్లతో సంక్షేమ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ‘ది ఏఐ-171 మెమో రియల్ అండ్ వేల్ఫేర్ ట్రస్ట్’ను ముంబైలో రిజిస్టర్ చేసింది. ఇందుకోసం టాటా సన్స్, టాటా ట్రస్ట్ చెరో 250 కోట్లు ట్రస్టుకు జమ చేయనున్నాయి.
విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఈ ట్రస్టు అందజేస్తుంది. ఇదే ట్రస్టు ద్వారా విమాన ప్రమాదంలో గాయపడినవారికి వైద్య సహాయం అందిచడం, ఘటనలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి పూర్తి సహ కారం అందిస్తారు. జూన్ 12న జరిగిన వి మాన ప్రమాదంలో 260 మంది మరణించిన సంగతి తెలిసిందే.