calender_icon.png 19 July, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీవోకేలోకి మసూద్ అజార్!

19-07-2025 12:50:26 AM

గిల్గిత్ బల్టిస్థాన్ ప్రాంతంలో జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్

న్యూఢిల్లీ, జూలై 18: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజార్ తలదాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీవోకేలోని గిల్గిత్ బిల్టిస్థాన్ అనే ప్రాంతంలో అతడి కదలికలను భారత ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. తన స్థావరమైన బహవల్పూర్‌కు దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో మసూద్ అజార్ ఉన్నాడని తెలిపింది. భారత్ జాబితాలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో మసూద్ అజార్ ఒకడు.

2016 పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి, 2019 పుల్వామా దాడికి ప్రధాన సూత్రధారి. అతడిని అంతమొందించాలనే భారత సైన్యం బాలాకోట్ ఎయిర్‌స్టుక్ చేసింది. కానీ తృటిలో తప్పించుకొని సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయాడు.  భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో మసూద్ కుటుంబం మొత్తం భూ స్థాపితమైంది.  తాజా సమాచారంతో పాకిస్థాన్.. ఉగ్రవాదులకు అండగా ఉంటుందని మరోసారి నిరూపితమైంది.