calender_icon.png 13 November, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రాతో ముగించారు

19-12-2024 12:14:23 AM

భారత్, ఆసీస్ మూడో టెస్టు

బ్రిస్బేన్: బోర్డర్‌ెేగావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. క్రితం రోజు స్కోరుకు మరో 8 పరుగులు జోడించిన భారత్ 260 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడే ప్రయత్నంలో ఆసీస్ 89/7 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా ముందు 275 పరుగుల లక్ష్యం విధించింది. భారత్ 8/0 వద్ద ఉన్నప్పుడు వర్షం ముంచెత్తింది.

ఆ తర్వాత ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. నాలుగో టెస్టు డిసెంబర్ 26న మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది. మ్యాచ్ డ్రా కావడంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2023 పట్టికలో భారత్ (114 పర్సంటైల్ పాయింట్లు) ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగుతోంది. కాగా సౌతాఫ్రికా తొలి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా (106 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది.