30-09-2025 01:48:36 AM
హైదరాబాద్ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో సింగిల్‌గానే బరిలోకి దిగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలం గా ఉందని.. ఎన్నికల్లో అధిక సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను స్వాగతిస్తున్న ట్టు చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో పాలన కుంటుపడిందన్నా రు.
స్థానిక ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయ ని ఆయన పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు తాము సంపూర్ణ మద్దతిస్తున్నట్టు తెలిపారు. ఈ జీఓ గతంలోనే ఇచ్చి ఉంటే సమస్య వచ్చేది కాదని, ఎన్నికల షెడ్యూ ల్ నిలబడుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ నాయకులేమో...రాష్ట్రపతి, గవర్నర్, బీజేపీ అడ్డుకుంటుందని, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మోకాలడ్డుతున్నారని డ్రామాలు ఆడారని పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించకుండా ఇన్ని రోజులు ప్రభుత్వం సాకులతో కాలయాపన చేసిందని విమర్శించారు. తెలంగా ణ ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలన చూశారని, ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.