30-09-2025 01:48:47 AM
ఆశ్వారావుపేట, సెప్టెంబరు 29(విజయ క్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అ న్ని రంగాలలో అభివృద్ధిలో ముందుండేలా కృషి చేస్తున్నానని. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. సోమవారం ఉదయం అశ్వా రావుపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పట్టాలను ల బ్దిదారులకు పంపిణీ చేసారు. ముస్లింమైనార్టీ లకు మంజూరైన 93 మంది మహిళలకు కట్టుమిషన్లును ఎమ్మెల్యే పంపిణీ చేసారు.
అనంత రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎ మ్మెల్యే ఆదినారాయణ మాట్లాడ తూ ఆశ్వారావుపేట అర్బన్ బస్టాండును మినీ డిపోగా అ భివృద్ధిచేసేందుకు, మందలవల్లి, దమ్మపేట బస్టాండు అధునీకరణకు నిధుల మంజూరి అ యినట్టు ఆయన తేలి పారు. ఇప్పటికే చంద్రుగొండ బస్టాండుకు ప్రహరీ నిర్మాణం జరు గుతుందన్నారు.
గండుగులపల్లి- గోపాలపురం డబుల్ రోడ్డు వీటితో నిర్మించేందుకు రూ.20 కోట్లు, ఇటీవలే ఖారీ వర్గాలకు పాడైన రహదారుల మరమ్మత్తులకోసం అన్నపురెడ్డిపల్లికి రూ. 2కోట్లు, చంద్రుగొండ మండలానికి రూ.84లక్షల రూపాయలు నిధులు మంజూరి చేసామ ని, మిగతా వ మండలాలకు రెండవ దపాలో మంజూరి అవుతాయన్నారు. అశ్వారావుపేట మునిసిపాలిటీ పరిధిలో మునిసిపాలిటీ కార్యాలయానికి రూ.7కోట్లు ఫ్రూట్, నాన్ వెజ్ మార్కెట్ల అభివృద్ధికి కోటి, దొంతికుంట చెరు వు అభివృద్ధికి రూ.5 కోటు, పట్టణంలో సిసి రహదారులు డ్రైన్లకు రూ.1.5 కోట్లు, పబ్లిక్ టా యిలెట్స్ నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరైనట్టు తెలిపారు.
ఒక్కో మండలంలో 10 గ్రామ పంచాయతీలను మోడల్. గా తీసుకొని సోలార్ ల్యాంప్స్, ఆర్ ఓ పాంట్ల ఏర్పాటుకు రూ.7 కోట్లు మంజూరయ్యాయన్నారు. మండలానికి గ్రామంలో గృహవినియోగానికి సోలా ర్ విద్యుత్ను అందించేందుకు ప్రణాళిక చేవటామని, ఇప్పటికే గండుగులవల్లి గ్రామంలో ప్రా రంబించామన్నారు.
ఆశ్వారావుపేట పట్ట ణంలో మొదటి దపాగ 137 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చామని మునినిపాలిటీ వరదలో మూడు దపాలుగ 1500 ఇళ్ళు మంజూరి చేస్తామన్నా రు. ప్రతి మండలానికి భవిత భవ నాలకోసం రూ.2.50కోట్లు మంజూరయ్యాయన్నారు. ఆ శ్వారావుపేటలో నిర్మిస్తున్న సెంట్రల్ లైటింగ్, విస్తరణ, డ్రైన్ల నిర్మాణం రూ. 25కోబు వెచ్చించామని. బడ్జెట్ కేటాయిం డ్రైనేజీలు, పైపులై న్లు, విద్యుత్ లైన్లు ,షిప్టింగ్ అనుమతులు కో సం, ఆదనపు నిధుల మంజూరీ కోసం, విస్తరణ పనులో కొని ఆటంకాలతో పనులో కొంత అలన్నమైందన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసపాలిటి టి పి ఓ శ్రీనివాసరావు, ఎంపిడి ఓ అప్పారావు, తహసీల్దార్ రామకృ ణ,ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు. సొసైటీ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తుమా రాంబాబు, పర్సా వెంకట్, కక్కిరాల రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి ,జూపల్లి ప్రమోద్ ఐదు మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.