calender_icon.png 9 January, 2026 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిచ్చికుక్కల స్వైర విహారం.. 12 మందికి గాయాలు

09-01-2026 12:37:40 AM

చండూరు, జనవరి 8(విజయ క్రాంతి): చండూరు మున్సిపాలిటీలో గురువారం పిచ్చికుక్క స్త్వ్రర విహారం  చేసింది. స్థానిక యూనియన్ బ్యాంక్, కస్తాల రోడ్డు సమీపంలో 12 మందిపై దాడి చేసి గాయపరిచింది. గమనించిన స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం  చండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండడంతో కుక్క కాటుకు గురైన వారందరికీ వైద్య సిబ్బంది చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వైద్య అధికారి మాసరాజు తెలిపారు. కాగా పిచ్చి కుక్కలు స్థానికులు అంతంమొందించినట్లు తెలుస్తుంది.