calender_icon.png 9 January, 2026 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్ధార్థ స్కూల్లో సంక్రాంతి సంబురాలు

09-01-2026 12:36:57 AM

చొప్పదండి, జనవరి 8 (విజయ క్రాంతి): సిద్ధార్థ స్కూల్ చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి స్థానిక చొప్పదండి మండలంలోని సిద్ధార్థ ఇంగ్లీష్  మీడియం హై స్కూల్ లో ముందస్తుగా కన్నుల పండుగగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు విచ్చేసిన సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర విగ్రహానికి పూలమాల వేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో వివిధ రంగవళ్ళులతో చక్కగా అలంకరించి, వాటి మధ్యలో గొబ్బెమ్మలను తిలకించి, భోగి మంటలను వెలిగించారు. తదనంతరం ఎడ్ల బండి పై వచ్చి అక్కడ ఏర్పాటు చేయబడిన వరి నాటు మడిని పరిశీలించి వరి నాటునందించారు.

తదుపరి పల్లె వాతావరణంగా ఏర్పాటు చేయబడిన బొమ్మల కొలువును తిలకించి, పిల్లలపై భోగి పళ్ళను పోశారు. చక్కని వేషధారణలో వచ్చిన విద్యార్థి హరిదాసులకు కానుకలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే మకర సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉన్నదని, ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న మన హిందూ ధర్మంలో భాగంగా సంక్రాంతి పండుగ విశిష్టత గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం అన్నారు.

ప్రతి పండుగలో ఎన్నో సంస్కృతి, సాంప్రదాయాలు  దాగి ఉంటాయని వాటిని విద్యార్థులు చూసి అర్థం చేసుకోవాలని తెలిపారు.  అనాదిగా మన పూర్వీకులు పాటిస్తున్న ఆచారాలను తప్పకుండా మనం అలవర్చుకోవాలని తెలిపారు. అనంతరం సంప్రదాయ దుస్తులతో వచ్చిన వివిధ తరగతులకు చెందిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చిన్నపిల్లలు పతంగులు ఎగురవేసి తమ కోలాహాలం సృష్టించారు. దీనిలో భాగంగా సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన  ఉపాధ్యాయునిలు తమ ప్రత్యేకతను  చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ మేడం, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పాల్గొన్నారు.