calender_icon.png 6 July, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నార్సింగి మున్సిపాలిటీకి పర్యావరణ అవార్డు

06-06-2025 12:46:01 AM

మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అందుకున్న కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి 

రాజేంద్రనగర్, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నా ర్సింగి మున్సిపాలిటీకి అవార్డు అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషిచేసినందుకు క మిషనర్ టి. కృష్ణమోహన్ రెడ్డి కి మంత్రి కొండా సురేఖ అవార్డు ప్రదానం చేశారు. ప్లాస్టిక్ నిషేధం అమలు, కచ్చితమైన ఘన వ్యర్ధాల నిర్వహణ, పచ్చదనానికి ప్రోత్సాహం తదితర చర్యల ద్వారా నార్సింగి పట్టణాన్ని పర్యావరణ పరిరక్షణలో కృషి చేసినందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అవార్డును ప్రదానం చేశారు.

గురువారం తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ, ఎండోమెంట్స్ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో అందజేశారు. అనంతరం కమిషన ర్ కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎంత బాధ్యతతో పని చేస్తానని తెలియజేశారు. సిబ్బంది అందరి కృషితో అవార్డు వచ్చిందని పేర్కొన్నారు. మరింత ఉత్సాహంగా పనిచేస్తామనితెలిపారు